Ananthapuram News Today: జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అనంతపురం జిల్లా వజ్రకరూరులోని బోడిసాని పల్లి చెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..
వివాహితతో అసభ్యకర ప్రవర్తనే కారణం: వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ (25) అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సదరు వివాహిత కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వజ్రకరూరుకు వెళ్లారు. తనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారని తెలుసుకున్న శ్రీకాంత్, వజ్రకరూరులో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ ఘటనపై అతని భావ సుధాకర్ సైతం తీవ్రంగా మందలించాడు. దీంతో రాగులపాడుకు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన శ్రీకాంత్, తీవ్ర మనస్థాపనకు గురైయ్యాడు. అ తర్వాత శ్రీకాంత్ తన భార్యకు ఫోన్ చేశాడు. అనంతరం బోడిసాని పల్లి చెరువు గట్టు సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిపై గతంలోనే వజ్రకరూరు పోలీసు స్టేషన్ లో పోక్సో కేసు నమోదు కావడం గమనార్హం.
ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే