Girl Abduction Case In Visakha District: మాయ మాటలతో నమ్మించి బాలికను అపహరించాడు. గుట్టు చప్పుడు కాకుండా అందకి కళ్లూ గప్పి తిరుగుతున్నాడు. అయితే ఎట్టకేలకు నిందితునిపై నిఘా పెట్టిన పోలీసులు మాయగాడి చెర నుంచి బాలికను విడిపించి అతడిని అరెస్టు చేశారు. బాలికను అపహరించిన కేసులో ఈ నిందితుడిని అరెస్టు చేసిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా..
యువతి అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు- పవన్ ఆదేశించిన 48గంటల్లో వీడిన మిస్టరీ - Woman Missing Case
ఇదీ జరిగింది: విజయనగరంలోని సాలిపేటకు చెందిన పతివాడ మహేష్ (26) విశాఖలోని 88వవార్డు పరిధిలో జేసీబీ డ్రైవర్. ఇతడు పనిచేసే ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక (14)కు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. రెండు నెలల క్రితం బాలిక ఎప్పటి మాదిరిగానే పాఠశాలకు వెళ్లగా ఇద్దరమూ పెళ్లి చేసుకుందామని ఆమెను అపహరించాడు. కుమార్తె బడి నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై అంతటా వెతికినా ఫలితం లేకపోయింది. దాంతో గత ఏడాది అక్టోబరు 20వ తేదీన సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెట్టి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరి కోసం గాలించారు.
ఇటీవల వారు ఓ ఫోన్ని కొని వాడుతున్నారని తెలిసి ఆ ఫోన్ ఆధారంగా వారి ఆచూకీని గుర్తించారు. విషయం తెలుసుకున్న నిందితుడు బాలికను తన ఇంటికి సమీపంలో దిగబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడిపై నిఘా పెట్టి సబ్బవరం మండలం అనకాపల్లి కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశామని, పోక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు పలుమార్లు బాలికకు శారీరకంగా దగ్గరయ్యాడు. వివాహం కూడా చేసుకున్నట్లు తెలిసిందని తెలిపారు. పతివాడ మహేష్ ను అదుపులోకి తీసుకుని పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ పి.రమణ ఈ వివరాలను వెల్లడించారు.
సోదరుడే సహకరించాడు: బాలికకు వరుసకు సోదరుడు (25) అయిన వ్యక్తే వారికి సహకరించి ఏమీ తెలియనట్లు వ్యవహరిండం విశేషం. బాలిక సైతం ఈ విషయంలో సహకరించాలని కోరడంతో అవసరమైన నగదు, దుస్తులు ఇచ్చి వారిని దగ్గరుండి మరీ పంపించాడు. వారి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరోవైపు తన సోదరి కనిపించడం లేదంటూ పోలీసులను తప్పుదారి పట్టించేవాడు. బాలిక సోదరుడిని ఏ2 నిందితుడుగా చేర్చామని పోలీసులు అన్నారు. ఆమెను ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపామని అధికారులు తెలిపారు.
''బాలికకు వరుసకు సోదరుడైన వ్యక్తే వారికి సహకరించి ఏమీ తెలియనట్లు వ్యవహరిండం విశేషం. బాలిక సైతం ఈ విషయంలో సహకరించాలని కోరడంతో అవసరమైన నగదు, దుస్తులు ఇచ్చి వారిని దగ్గరుండి మరీ పంపించాడు. వారి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరోవైపు తన సోదరి కనిపించడం లేదంటూ పోలీసులను తప్పుదారి పట్టించేవాడు''-పరవాడ డీఎస్పీ సత్యనారాయణ,
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గ్రౌండ్ - కత్తులు, రాళ్లతో దాడి