Fraud in name of jobs : కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన బండారు పృథ్వి అనే యువకుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి ఓ మెడికల్ కళాశాలలో ఉద్యోగంలో చేరాడు. జల్సాలకు అలవాటు పడిన పృథ్వి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతికి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పూనుకున్నాడు. ఇలా మోసాలు చేస్తూ.. చివరికి అనంతపురం జిల్లా గుంతకల్ పోలీసుల చేతికి చిక్కాడు. గుంతకల్ పోలీసులు ఇతని గురించి సమాచారం అందటంతో అరెస్టు చేశారు.
ఇతని వద్ద నుంచి 2 లక్షల 5 వేల రూపాయల నగదు, రెండు ద్విచక్రవాహనాలు, మోసాలకు పాల్పండేేందుకు వినియోగించిన పోలీస్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నానని నిరుద్యోగులను నమ్మించి.. పోలీస్, వైద్యశాఖలో ఉద్యోగాల పేరుతో ఎర వేశాడని పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడించారు. గుంతకల్ నుంచి 11 మంది బాధితులున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వారి పట్ల నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి: