అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో దాసరి వెంకటేశులు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచాడు. సోదాలు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు 46 బస్తాల చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశామని ఉరవకొండ ఎస్ఐ ధరణి బాబు తెలిపారు. బియ్యం బస్తాలు స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి. సామాజిక మాధ్యమాల్లో మావోయిస్టు వ్యతిరేక వీడియో హల్చల్