అనంతపురం జిల్లా పరిగి మండలంలో పేకాటస్థావరంపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇటీవల మండల సరిహద్దుల్లో జూదం పెరిగిందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా వన్నాంపల్లి గ్రామ సమీపంలో 17మందిని అరెస్టు చేసి... వారివద్ద నుంచి ఒక లక్ష రూపాయల నగదు... 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మండలంలో ఎవరైనా జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు.
ఇదీ చదవండీ...పారిస్లో 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్