ETV Bharat / state

కిడ్నాప్ చేస్తామని బెదిరింపు.. నిందితుల అరెస్ట్ - Anantapur District Crime News

డబ్బులు డిమాండ్ చేస్తూ.. కిడ్నాప్ చేస్తామని బెదిరించిన ఇద్దరు నిందితుల్ని అనంతపురం పోలీసులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నట్లు డీఎస్పీ వీరరాఘవ రెడ్డి తెలిపారు. వారి నుంచి ఒక స్కార్పియో వాహనం, 3 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కిడ్నాప్ చేస్తామని బెదిరించిన నిందితులు అరెస్ట్

author img

By

Published : Feb 24, 2021, 5:13 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయనకి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని.. లేకపోతే తన కూతురు, కుమారుడిని కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. ఘటనపై చంద్రశేఖర్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అనంతపురం పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. కిడ్నాపర్లతో రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు నమ్మబలికి బత్తలపల్లి మండలం జ్వాలాపురం క్రాస్ వద్దకు రావాలని చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరవెంకట సుబ్బరాజు, బాబావలి అనే ఇద్దరిని పట్టుకున్నామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. డబ్బులు అక్రమ మార్గంలో సంపాదించాలని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇవీ చదవండి

తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి పిరికిపంద చర్య: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.