అనంతపురం జిల్లాలో పోలీసులు దాతృత్వం చాటారు. మృతి చెందిన సహచర కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. బెళుగుప్ప పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సూర్యనారాయణ... ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతుడి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని ఆయన సహచర ఉద్యోగులు సంకల్పించారు. ఈ క్రమంలో రూ. 2,04,116 మొత్తాన్ని సేకరించారు. ఈ నగదును జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు చేతుల మీదుగా సూర్యనారాయణ కుటుంబీకులకు అందజేశారు. ఈ సాయం పట్ల సూర్యనారాయణ భార్య విమలాదేవి, కూతురు లక్ష్మీసాయి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: