ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్ ... వీధిబాలలు, బాలకార్మికులకు విముక్తి

కరోనా వైరస్ నుంచి వీధి బాలలను, బాల కార్మికులను సంరక్షించేందుకు డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలపై చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అనేక మంది చిన్నారులను గుర్తించి సంరక్షణా గృహాలకు, వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Operation Muskan
ఆపరేషన్ ముస్కాన్
author img

By

Published : May 19, 2021, 8:11 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా.. పోలీసులు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం చేపట్టారు. వీధి బాలలను, బాలకార్మికులను గుర్తించి.. వారికి విముక్తి కల్పించారు.

కర్నూలు జిల్లా ...

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 340 మంది చిన్నారులను పోలీసులు గుర్తించారు. వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ. డాక్టర్.ఫక్కీరప్ప తెలిపారు.

కడప జిల్లా ...

కడప జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా 493 మంది పిల్లలను పోలీసులు గుర్తించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు.

అనంతపురం జిల్లా...

అనంతపురం జిల్లాలో దుకాణాల్లో పని చేస్తున్న 69 మంది బాలకార్మికులను గుర్తించి సంరక్షణా గృహాలకు తరలించారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో బాలకార్మికుల తల్లిదండ్రులతో ఎస్పీ సత్యఏసు బాబు సమావేశం నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. 'రెస్క్యు బాలలకు దుస్తులు, సురక్షిత ఉపకరణలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

చిత్తూరు జిల్లా...

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా పోలీసులు... బస్టాండ్లు, రైల్వే స్టేషన్, హోటళ్లలో, కర్మాగారాలలో మగ్గుతున్న 52 మంది చిన్నారులను గుర్తించారు. సదరు బాలబాలికలను వారి తల్లి దండ్రులు, బందు మిత్రులను, రక్త సంబందికులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలకు అప్పగించారు.

ప్రకాశం జిల్లా ..

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 80 మంది చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకొని... వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం శానిటైజర్లతో బాలబాలికల చేతులను శుభ్రంగా కడిగి అల్పాహారాన్ని అందించారు.

కృష్ణా జిల్లా ...

కృష్ణా జిల్లా మైలవరంలో 38 మంది బాల కార్మికులని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం గడిపే 30 మంది పిల్లలకు విముక్తి కల్పించారు. నందిగామలో 40మంది బాలకార్మికులను గుర్తించారు.

తూర్పు గోదావరిజిల్లా...

తూర్పుగోదావరిజిల్లా ప్రత్తిపాడులో దుకాణాల్లో పని చేస్తున్న పది మంది చిన్నారులను పోలీసు స్టేషన్‌కు తరలించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా..

పశ్చిమగోదావరి జిల్లాలో వీధిబాలలను, బాలకార్మికులను గుర్తించి.. వారికి కొవిడ్ పరీక్షలు చేయించారు. అనంతరం కోడిగుడ్లు, ఆరటి పండ్లు, మాస్క్​లు అందజేసి... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

విశాఖ జిల్లా...

విశాఖ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా వీధిబాలలను, బాలకార్మికులును గుర్తించి... వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో తల్లిదండ్రులు లేని పిల్లలను స్త్రీ సంక్షేమ పిల్లల సంరక్షణ కేంద్రాలుకు పంపించారు.

శ్రీకాకుళం జిల్లా...

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పలు దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. బాలకార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి

కరోనాతో మృతి చెందిన పోలీసు సిబ్బందికి.. పోలీస్ కమిషనర్ నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.