Hawala Money case in Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడులో కారులో నుంచి నగదు కొట్టేసిన ముఠా మూలాలపై దర్యాప్తు చేయటంతో హవాలా నగదు కొట్టేసే కరుడుగట్టిన కేరళ శ్రీధరన్ ముఠా గుట్టురట్టైంది. హవాలా సొమ్మును తరలించే వాహనాలే లక్ష్యంగా శ్రీధరన్ ముఠా కార్లను వెంటాడి, నగదు తరలించే వారిని బెదిరించి దోచుకుంటున్నారు. హవాలా సొమ్ము కావటంతో నగదు దొంగతనంపై ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయక పోవటంతో ఇంతకాలం తెలియకుండా పోయింది. అనంతపురం పోలీసులు రాప్తాడులో 1.89 కోట్ల రూపాయల నగదును పట్టుకోవటంతో మొదలైన దర్యాప్తు ప్రత్యేక బృందాలతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ముమ్మర పరిశోధన చేశారు. ఎట్టకేలకు హవాలా సొమ్ము దోపిడీ చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబందించిన వివరాలను ఎస్పీ ఫక్కీరప్ప మీడియా సమావేశంలో వెల్లడించారు.
దీంతో కేరళకు చెందిన హవాలా సొమ్మును కొట్టేసే ముఠాను నడుపుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఠాలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ఆపరేషన్ అనంత పేరుతో విచారణ కొనసాగించినట్లు వెల్లిడంచారు. పోలీసుల దర్యాప్తులో ముఠా నాయకుడు కేరళకు చెందిన శ్రీధరన్ కరుడుగట్టిన నేరస్తుడని తేలింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా హవాలా సొమ్ము తరలించే వాహనాలే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు అంతపురం పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసును చేదించడాని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అంతపురం జిల్లా నుంచి 25 బృందాలుగా వంద మంది పోలీసులు వెళ్లి దర్యాప్తు చేసినట్లు అంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. మధ్యప్రదేశ్, నైజీరియా ముఠాలపై కొద్దిరోజులుగా పోలీసులు నిఘా పెట్టినట్లు వెల్లడించారు. గత కొంత కాలంగా... శ్రీధరన్ ముఠాపై నిఘా పెట్టడంతో హవాలా సొమ్ము విషయం వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
హవాలా సొమ్మును అక్రమ మార్గంలో మళ్లీ దొచుకోవడంపై ఇది ఓ కొత్త రకమైన కేసు. హవాలా మార్గంలో డబ్బులు సంపాదించే వారు, ఆ డబ్బులు పంపించే వారిని దృష్టిలో ఉంచుకొని శ్రీధర్ అనే వ్యాక్తి.. ముఠాలను నడుపుతున్నారు. ఇలా శ్రీధర్ తనకు ఉన్న ముందస్తు సమాచారంతో డబ్బులను దొచుకునే వారికి సహాయం చేస్తారు. హవాలా డబ్బులను వాహనంలో సరఫరా చేస్తారని శ్రీధర్ చెప్పిన సమాచారం మేరకు, ఈ ముఠా డబ్బులు దొచుకుంటారు. హవాలా సొమ్ము కనుక డబ్బులు పోయినా పోలీసు కేసులు పెట్టలేరని వారు ఈ విధంగా దొచుకుంటున్నారు. కేరళాకు చెందిన శ్రీధర్ హైదరాబాద్, బెంగళురులో దొంగతనం చేయిస్తారు. హవాలా సొమ్ముతో వచ్చే వాహనాన్ని ఆపి వారి వద్ద నుంచి డబ్బులు దొచుకుంటారు. ఫక్కీరప్ప, ఎస్పీ
ఇవీ చదంవడి: