modi on uravakonda road accident: ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే...
ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామస్తులు కర్ణాటక బళ్లారిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది చదవండి: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 9 మంది దుర్మరణం