శ్రీశైల మహాక్షేత్రంలో 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నెరంజమ్ పల్లెకు చెందిన.. 120 మంది భక్తులు శ్రీశైలం దర్శనానికి వచ్చారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న.. భోజనం తిని నిద్రపోయారు.
తెల్లవారుజామున 3.30 సమయంలో 25 మందికి వాంతులు, విరేచనాలు మెుదలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రాజెక్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరికి రక్త విరేచనాలు కావటంతో.. కర్నూలుకు తరలించారు. మిగిలిన వారంతా.. సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:
చివరి నిమిషం వరకూ ఆగని ఉపసంహరణల పర్వం.. ప్రలోభాలు, ఒత్తిళ్లే కారణమన్న విపక్షం