చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. మృతుడు గుత్తి పట్టణం అంబేడ్కర్ కాలనీకి చెందిన రమేష్‌గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన రమేష్ మృతదేహం ఒడ్డున ఉండటం వల్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :