ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రజలు బారులు తీరారు. ఆరు నెలల పాటు నిలిచిపోయిన ఆధార్ కేంద్రాలు... 2 రోజుల నుంచి తెరవటంతో ఒక్కసారిగా ప్రజలు తరలివచ్చారు. వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావటంతో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు భౌతిక దూరం మరచి గుంపులు గుంపులుగా బారులు తీరారు. వారిని వారించడం పోలీసులకు కష్టతరమైంది. చివరికి ఆధార్ కేంద్ర నిర్వాహకుడు టోకెన్ పద్ధతిలో సమయాన్ని కేటాయిస్తామని చెప్పటంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇదీ చదవండి: 'న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయమనండి'