ETV Bharat / state

People ill health: పలువురికి అస్వస్థత.. కలుషిత నీరే కారణమని ఆరోపణలు - మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

People Sick: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బెలోడు గ్రామపంచాయతీ వారు గ్రామంలోని తాగునీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంక్ గత ఏడాదిగా శుభ్రం చేయకపోవడం వల్ల గ్రామంలోని 19మందికి తీవ్ర విరేచనాలు, వాంతులు అయ్యాయి. గ్రామ ప్రజలు బాధితులను వెంటనే రాయదుర్గం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో గ్రామంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 10, 2023, 10:17 PM IST

People Sick: తాగునీరు కలుషితమై కొంతమంది అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బెలోడు గ్రామంలో జరిగింది. గ్రామ పంచాయతీ వారు గ్రామంలోని తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ గత ఏడాదిగా శుభ్రం చేయకపోవడం గ్రామంలోని పదిమందికి తీవ్ర విరేచనాలు, వాంతులు అయ్యాయని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామ ప్రజలు బాధితులను వెంటనే రాయదుర్గం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో గ్రామంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

19 మందికి అస్వస్థత: గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో కలుషితమైన నీరు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరు రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలోనూ, అనంతపురం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గ్రామపంచాయతీ వారు సరఫరా చేసే నీరు తాగడం వల్ల గ్రామంలో వాంతులు విరేచనాలతో పలువురు ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీని గురించి గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

వైద్యశాలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ: కలుషితమైన నీరు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డీఎంహెచ్ఓ పరామర్శించారు. రోగులకు ఉత్తమ చికిత్స అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత్ రెడ్డి బేలోడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆయన ఆదేశించారు. గ్రామంలోని ఓవర్ హెడ్​ ట్యాంకులు, తాగునీటి కుళాయిలు, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో గ్రామ ప్రజలు అస్వస్థతకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధికారులకు విన్నవించారు. గ్రామపంచాయతీ వారు తాగునీటి కుళాయిల వద్ద తాగునీటి పథకాల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

బాధితులను పరామర్శించిన పలువురు నాయకులు: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అధికార పార్టీకి చెందిన గ్రామపంచాయతీ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు మాత్రం గ్రామంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. బాధితులు, వారి కుటుంబ సభ్యులు మాత్రం గ్రామంలో పంచాయతీ వారు సరఫరా చేసే తాగునీటి కలుషితం వల్ల వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.