అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అగళి మండలంలోని రాగేలింగనహళ్ళి, నందరాజనపల్లి, ఇరిగేపల్లి గ్రామాల్లోని లబ్ధిదారులకు గత రెండు నెలలుగా పింఛన్లు నిలిచిపోయాయి. గతంలో వేలిముద్రలు పడని వారికి అధికారుల వేలిముద్రలతో ఫించన్ సొమ్ము పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలకటంతో లబ్ధిదారులు వేలముద్ర నమోదు కోసం ఆధార్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల వారి వేలిముద్రలు ఆధార్ కేంద్రంలో నమోదు కాకపోవటంతో వారు ఫించన్లు పొందలేకపోతున్నారు.
అన్ని అర్హతలు ఉన్నా..ఫించన్లు అందకపోవటంతో సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఫించన్లు నిలిపివేయటం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. వేలి ముద్రలతో సంబంధం లేకుండా తమ అర్హతలపై సమగ్ర విచారణలు జరిపి తిరిగి పెన్షన్లను పునరుద్ధరించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి
Gang Rape: గుంటూరు సామూహిక అత్యాచార ఘటనలో ఆ వార్తలు అవాస్తవం: డీఐజీ