కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగినన్ని నిధులు కేటాయించి వైద్య సదుపాయాలు కల్పించాలని... పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన పరిశీలించారు. కరోనా అనుమానితులు వస్తే వారికి పరీక్షలు, ఇతర సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉందా లేదా అని వైద్యులనడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, పరికరాలు అందజేయాలని కోరారు. రాష్ట్రాలకు కేంద్రం కనీసం రూ.10వేల కోట్లు కేటాయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
ఇదీచూడండి. కుమారుడు లేని లోటు తీర్చింది.. అంత్యక్రియలు పూర్తి చేసింది