వైకాపా బాధితులను స్వగ్రామాలకు తరలించేవరకు పోరాటం కొనసాగిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు. సమస్య... ఒక్క పల్నాడుకే పరిమితం కాలేదని... రాష్ట్రవ్యాప్త సమస్య అన్నారు. తెదేపా కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాడులు జరిగాయని మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలతో తెదేపా పోరాటాలు అడ్డుకోలేరుని పయ్యావుల కేశవ్ అన్నారు. తొలి వంద రోజుల్లోనే అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగినా పోరాటం చేస్తామని... అన్యాయంగా కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ గృహనిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి