Paritala Sunitha Comments on YCP: రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జాకీ పరిశ్రమను రాప్తాడుకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత గంగులకుంట గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు.
నిలకడ లేని నాయకుడి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నిలకడ కోల్పోయిందని విమర్శించారు. సామాన్య ప్రజలు బతుకు భారమైందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యవసర ధరల నుంచి కరెంటు బిల్లు వరకు విపరీతమైన ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గంగులకుంట గ్రామ చెరువుకు శాశ్వతంగా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి: