అనంతపురం జిల్లా ధర్మవరంలో.. స్థానిక ఎమ్మెల్యే తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్(tdp leader Paritala Sriram), జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి(tdp leader BK Parthasarathi) ఆరోపణలు చేశారు. ధర్మవరంలో 500 మందికి ఉపాధి కల్పించే కూరగాయల మార్కెట్‌ను.. అర్ధాంతరంగా కూల్చివేయడం దారుణమన్నారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న ప్రజలకు.. కనీస సమాచారం, నోటీసులు ఇవ్వకుండా రాత్రికిరాత్రి దుకాణాలను తొలగించడం ఏంటని మండిపడ్డారు. అక్కడున్న మున్సిపల్ కమిషనర్.. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో ఉన్న దుకాణాలను.. వైకాపా నాయకులు దౌర్జన్యంగా కూల్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని.. జిల్లా కలెక్టర్‌ను కోరారు.
రాత్రికిరాత్రే దుకాణాలు కూల్చివేత చర్యలకు పాల్పడిన వైకాపా నాయకులపై.. కేసులు నమోదు చేయాలన్నారు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోతోందని, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం దీనిపై స్పందించాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని.. పరిటాల శ్రీరామ్, పార్థసారథి హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం