ETV Bharat / state

'ఆశా వర్కర్ కేసు నీరుగార్చేందుకే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రయత్నాలు' - ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నంపై పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు. ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం ఘటన నుంచి అనుచరులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి, అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు.

paritala sriram allegations on mla prakash reddy, paritala sriram on asha worker issue
పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ విమర్శలు
author img

By

Published : Apr 20, 2021, 10:05 PM IST

మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్

ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం ఘటనలో తన అనుచరులను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే ఉలిక్కిపడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ విమర్శించారు. అనంతపురంలోని ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళను లైంగికంగా వేధిస్తే న్యాయం చేయాల్సిందిపోయి.. తిరిగి ఆమెపై కేసు పెట్టి విషయాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి కేసునే నీరుగార్చిన మీకు.. పేద ప్రజలు ఎక్కడ కనిపిస్తారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం'

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందని ఆరోపించారు. పౌర సరఫరాల సరకుల్లో అనేక అక్రమాలు చేస్తూ.. ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. ప్రజల అభివృద్ధికి తోడ్పడాల్సిందిపోయి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. త్వరలో ఆయన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఆశా వర్కర్​కు మాజీ మంత్రి సునీత పరామర్శ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.