ETV Bharat / state

అన్యాయాన్ని ఎదుర్కోవాలనే వారికి పరిటాల రవి స్ఫూర్తి: చంద్రబాబు

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర 63 జయంతిని రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించారు. పరిటాల కుటుంబ సభ్యులు పరిటాల రవీంద్ర ఘాట్​కు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. పేదలకు, బలహీన వర్గాలకు అండగా నిలిచి తన జీవితాన్ని అంకితం చేసిన ఉదాత్త చరితుడు, సాహసి పరిటాల రవి అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.

Paritala jayanthi
Paritala jayanthi
author img

By

Published : Aug 30, 2021, 2:27 PM IST

దివంగత నేత పరిటాల రవీంద్ర ఆశయాలను కొనసాగిస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర 63 జయంతి వేడుకలను రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించారు. పరిటాల కుటుంబ సభ్యులు పరిటాల రవీంద్ర ఘాట్​కు నివాళులర్పించారు. మాజీ మంత్రి పరిటాల సునీత, తెదేపా నేత పరిటాల శ్రీరామ్ దివంగత పరిటాల రవీంద్ర నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయ సాధన కోసం తమ కుటుంబం అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. అనంతపురం జిల్లాకు పరిటాల రవీంద్ర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు.

పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా హైదరాబాద్​లో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వెంకటాపురంలో కొవిడ్ నిబంధనలతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పరిటాల రవీంద్ర అభిమానులు వెంకటాపురానికి తరలివచ్చి నివాళులర్పించారు.

అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా పరిటాల రవి నిలిచారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.

"నిస్సహాయ స్థితిలో అన్యాయానికి గురవుతున్న పేదలకు, బలహీన వర్గాలకు అండగా నిలిచి తన జీవితాన్ని అంకితం చేసిన ఉదాత్త చరితుడు, సాహసి పరిటాల రవి." అని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన అస్తమించని రవి అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. " కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణమిచ్చే అసంఖ్యాకమైన అభిమానుల్ని పరిటాల రవి సంపాదించుకున్నారు. అరాచక శక్తుల పాలిట సింహ స్వప్నమై, పేదలకు ఆపద్బాంధవుడై ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నా."- చంద్రబాబు

  • నిస్సహాయ స్థితిలో అన్యాయానికి గురవుతున్న పేదలకు, బలహీన వర్గాలకు అండగా నిలిచి తన జీవితాన్ని అంకితం చేసిన ఉదాత్త చరితుడు, సాహసి పరిటాల రవి. అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచిన పరిటాల రవి జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులు pic.twitter.com/J3ITVr79rl

    — N Chandrababu Naidu (@ncbn) August 30, 2021
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన అస్తమించని రవి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణమిచ్చే అసంఖ్యాకమైన అభిమానుల్ని పరిటాల రవి సంపాదించుకున్నారని ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. అరాచక శక్తుల పాలిట సింహ స్వప్నమై, పేదలకు ఆపద్బాంధవుడై ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని కొనియాడారు. పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఇదీ చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిధిలో పీవీ సింధు సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.