తనకు పద్మశ్రీ రావడం తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవంగా చలపతిరావు అభివర్ణించారు. 60 ఏళ్లుగా తోలుబొమ్మాలాట కళాకారుడిగా ఉంటూ ప్రదర్శనలు చేస్తున్నట్లు వివరించారు. తనకు అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలిపతిరావు స్వగ్రామమైన ధర్మవరంలో సందడి వాతావరణం నెలకొంది. తమ ఊరి వ్యక్తికి పద్మశ్రీ రావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. చలపతిరావు గతంలో జాతీయ అవార్డుతోపాటు శిల్పగురు అవార్డు పొందారు.
ఇదీ చదవండి: