ETV Bharat / state

100 పడకల కోవిడ్ ఆసుపత్రి.. ఒకే ఆక్సిజన్ సిలిండర్ - అనంతపురంలోని కల్యాణదుర్గం కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో.. మోడల్ పాఠశాలను వంద పడకల ఆసుపత్రిగా మార్చారు. అన్ని నియోజకవర్గాల్లో కొవిడ్ బాధితులకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం ఏ సౌకర్యం కానరావటం లేదు. 100పడకలకు.. ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయటంపై.. బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.

100 పడకల కోవిడ్ ఆసుపత్రి.. ఒకే ఆక్సిజన్ సిలిండర్

author img

By

Published : May 7, 2021, 8:56 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో.. మోడల్ పాఠశాలను వంద పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం ఇందులో 40 మందికి పైగా కోవిడ్ బాధితులు ఉన్నారు. అయితే..ఈ కేంద్రంలో వంద పడకలకు కలపి ఒకే ఒక ఆక్సిజన్ సిలిండర్​ను ఏర్పాటు చేశారు.

ఫలితంగా.. అవసరానికి ఆక్సిజన్ అందని బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బాధితునికి.. 15 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఈ ఆక్సిజన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ప్రశ్నించిన కోవిడ్ బాధితుల పట్ల.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

కాబోయే అమ్మకు కోవిడ్ సెగ.. వసతి గృహంలో గర్భిణులకు పాజిటివ్..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.