అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ విషయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. పట్టణంలో సమావేశమైన నివాసాల యజమానులు సంఘంగా ఏర్పడ్డారు.
విస్తరణ పేరుతో అధికారులు పలుమార్లు కొలతలు వేస్తూ పట్టణ వాసులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. వందలాది కుటుంబాల ఉపాధికి గండి కొట్టి రోడ్డు విస్తరణ చేపట్టవద్దని అధికారులను కోరాలని తీర్మానించారు. అనంతరం కోనేరు కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: