బళ్లారి వైపు నుంచి గుండ్లపల్లికి వేగంగా వస్తున్న వాహనం బొమ్మనహల్ మండలం ఎల్బీ నగర్ గ్రామం వద్ద పండ్ల వ్యాపారం చేసుకుంటున్న బాలుడిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి దస్తగిరి (17)గా పోలీసులు గుర్తించారు. బాలుడు పండ్ల వ్యాపారం చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడం వల్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై బొమ్మనహల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :