అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పుట్టపుర్తిలోని చిత్రావతి నది పొంగిపొర్లుతుంది. కర్ణాటకలోని బాగేపల్లి నుంచి చిత్రావతి నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. చిత్రావతి నది వద్ద నీటి ప్రవాహం భారీగా రావడంతో, ప్రజల తాకిడి ఎక్కువైంది. చిత్రవతి నది నుంచి పొంగుతున్న నీరు జిల్లాలోని బుక్కపట్నం చెరువులోకి చేరుతుండటంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రాంతంలో మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే బుక్కపట్నం చెరువు పూర్తిగా నిండుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మన్యంలో వింతకాంతులు... కారణాలు తెలియడం లేదంటా?