ETV Bharat / state

గుడిబండలో ఆపరేషన్ ముస్కాన్... 10మంది బాల కార్మికుల గుర్తింపు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పొలం పనులకు వెళ్తున్న 10మంది పిల్లలను పోలీసులు స్టేషన్​కు తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించారు.

operation muskan in gudibanda at ananthapur district
గుడిబండలో ఆపరేషన్ ముస్కాన్... 10మంది బాలకార్మికుల గుర్తింపు
author img

By

Published : Nov 3, 2020, 6:04 PM IST

ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా పోలీసులు... అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో 10మంది పిల్లలను గుర్తించి పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు. మోరుబాగల్, హిరేతుర్పి గ్రామాలలో పొలం పనులకు వెళ్తున్న పిల్లలను గుర్తించినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు.

పిల్లల తల్లిదండ్రులను స్టేషన్​కు పిలిపించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలకు వారి తల్లిదండ్రులకు సీడబ్ల్యూసీ అధికారులు అవగాహన కల్పించారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివిస్తామని తల్లిదండ్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.