అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో మహారాష్ట్రకు చెందిన దత్తు యశ్వంత్ ఆబాద్గిరి అనే ప్రయాణికుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం రైలులో వచ్చిన మహారాష్ట్ర వాసి స్టేషన్ సమీపంలోనే ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్‌పై పడుకొని ఉన్న వ్యక్తి మృతి చెందిన విషయం స్థానికులు ధర్మవరం పట్టణ పోలీసులకు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి...మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా ఉప్పల్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుని వద్ద బంధువులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు లేకపోవడంతో సమాచారాన్ని బంధువులకు చేరవేయలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మారం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు.
ఇదీ చదవండి:గోదావరి వరద... మళ్లీ పెరుగుతోంది