అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా కేసుల సంఖ్య వందకు చేరుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు అక్కడ లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ నిబంధనలు పట్టించుకోనివారిని కట్టడి చేసేందుకు ఆర్డీవో మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి అధికారులు రూ.200 జరిమానా విధించారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 11 గంటలకి దుకాణాలు మూసి వేయాలని ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆర్డీఓ హెచ్చరించారు.
ఇదీ చదవండి..