అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో బొజ్జన్న అనే యువకుడు మృతి చెందగా.. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులైన బొజ్జన్న, శ్రీనివాసులు.. శెట్టూరు నుంచి కళ్యాణదుర్గం వైపు కారులో వెళ్తున్నారు. అడవి గొల్లపల్లి సమీపంలోకి వచ్చేసరికి.. కారు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బొజ్జన్న తలకు తీవ్ర గాయాలవటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులకు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం... మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
ఇదీ చదవండి: