ETV Bharat / state

కర్ణాటక నుంచి డీజిల్ సరఫరా.. ట్యాంకర్​ సీజ్ చేసిన అధికారులు - ఏపీ వార్తలు

Diesel Supply from Karnataka: ఆర్టీసీ డిపోలకు డీజిల్ సరఫరా చేయడం ఆ గుత్తేదారు పని. ఇందుకోసం ఆ వ్యక్తి 130 కిలోమీటర్ల దూరం నుంచి డీజిల్ తీసుకురావాలి. కానీ నిబంధనలు అతిక్రమించి.. సదరు కాంట్రాక్టర్ 450 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక నుంచి డీజిల్‌ సరఫరా తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలతో.. ట్యాంకర్​ను తహసీల్దార్ సీజ్‌ చేశారు.

Diesel tanker seized in Anantapur
అనంతపురంలో డీజిల్‌ ట్యాంకర్‌ సీజ్‌
author img

By

Published : Feb 12, 2023, 2:26 PM IST

Diesel Supply from Karnataka: ఓ ప్రభుత్వ ఉద్యోగి తన పని తాను సక్రమంగా చేస్తుంటే.. ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయారు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. తప్పేమీ లేదని వాదించారు. అయినా సరే ఆ ప్రభుత్వ ఉద్యోగి.. కాంట్రాక్టర్ బెదిరింపులకు తలొగ్గలేదు. నాలుగు గంటల పాటు సాగిన రచ్చ తర్వాత.. ట్యాంకర్​ని సీజ్ చేశారు. ఏం జరిగిందంటే...

డీజిల్‌ ట్యాంకర్‌ సీజ్‌ చేసిన అధికారులు

అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ డిపోలకు కర్ణాటక నుంచి డీజిల్‌ సరఫరా చేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. గుంతకల్లు ఆర్టీసీ డిపోలో ఓ ట్యాంకర్‌ను.. రెవెన్యూ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య సీజ్‌ చేశారు. 12వేల లీటర్లతో గుంతకల్లు డిపోకు డీజిల్‌ ట్యాంకర్‌ రాగా.. రెవెన్యూ అధికారులు వే బిల్లులు పరిశీలించారు. గుంతకల్లు ఆర్టీసీ డిపోకు.. 130 కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నెలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి.. డీజిల్‌ సరఫరా చేయాలని కాంట్రాక్టు ఇచ్చారు. కానీ గుత్తేదారు 450 కిలోమీటర్ల దూరంలోని మడకశిర నుంచి డీజిల్‌ ట్యాంకర్‌ తెప్పించారు.

అయితే.. మడకశిర సరిహద్దులోని కర్ణాటక బంకుల నుంచి తెప్పించారనే అనుమానంతో ట్యాంకర్‌ సీజ్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ దశలో కాంట్రాక్టర్‌ రెచ్చిపోయారు. బిల్లులన్నీ సక్రమమే అని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటూ.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో.. గుంతకల్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ నారాయణ కూడా కాంట్రాక్టర్లకు జత కలిశారు. అనుమతి లేకుండా డిపోలోకి ఎలా వస్తారంటూ.. రెవెన్యూ అధికారులపైనే మండిపడ్డారు. దాదాపు 4 గంటలు వాదోపవాదాల తర్వాత స్థానిక తహసీల్దార్ ట్యాంకర్‌ను సీజ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.