అనంతపురం జిల్లాలోని గంగిరెడ్డిపల్లి చెరువుకి గండి పడటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండుకుంది. రాత్రి సమయంలో చెరువుకు గండి పడటంతో నీరు కట్ట కింద పంట పొలాల మీదుగా చిత్రావతి నదిలోకి వెళుతుంది. చెరువు మధ్య భాగాన గండి పడటంతో.. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. గండి పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
చెరువు క్రమంగా కోతకు గురి అవుతుండటంతో.. ఏ క్షణాన కట్ట తెగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. జేసీబీలు, టిప్పర్ల సహాయంతో ఇసుక మూటలు తరలించి గండిపూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పుట్టపర్తి అర్బన్ డీఎస్పీతో పాటు పోలీసు సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: చీడ నుంచి మొక్కలకు రక్షణగా కవర్లు