ETV Bharat / state

క్వారీలో బ్లాస్టింగ్ చేస్తున్న వారిని అడ్డుకున్న గ్రామస్థులు - నేమకల్లు కంకర క్వారీ పేలుళ్లపై అడ్డుకున్న గ్రామస్థులు

నేమకల్లు కంకర క్వారీలో పేలుళ్లు చేస్తుండగా గమనించిన గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు.

నేమకల్లు కంకర క్వారీ పేలుళ్లపై అడ్డుకున్న గ్రామస్థులు
author img

By

Published : Oct 12, 2019, 11:16 PM IST

అనంతపురం జిల్లా బొమ్మనహళ్​ మండలం నేమకల్లు కంకర క్వారీలో అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తుండగా... గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులను దిక్కరించి ఓ ప్రజాప్రతినిధికి చెందిన క్వారీలో తెల్ల కంకర కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారు. నలుగురు వ్యక్తులను బొమ్మనహల్​ పోలీస్ స్టేషన్​లో గ్రామస్థులు అప్పగించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మనహళ్​ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినా... కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించారని స్థానికులు తెలిపారు.
కంకర క్వారీలపై ఉత్తర్వులు ఏంటి?
కంకర క్వారీలపై హరిత ట్రిబ్యునల్​లో ప్రస్తుతం కేసు నడుస్తుంది. కంకర క్వారీలపై ఈనెల 15లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆంధ్ర ప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ అధికారులను ఆదేశించింది. ఇది వరకు హరిత ట్రిబ్యునల్ కంకర క్రషర్లు నడపడానికి మాత్రమే అనుమతులు మంజూరు చేసింది. కంకర క్వారీలకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు.

ఇదీ చదవండి :

ఒకప్పుడు రాత్రి, ఇప్పుడు పట్టపగలే గ్రావెల్ తవ్వకాలు

Reporter : j.sivakumar Rayadurgam Anantapuram (dist) ap 8008573082 * నేమకల్లు క్వారీలో అక్రమ పేలుళ్లను అడ్డుకున్న ప్రజలు * ఢిల్లీలోని హరిత ట్రిబ్యునల్ కు ఈనెల 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు * క్వారీ లో బ్లాస్టింగ్ చేస్తున్న నలుగురిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన ప్రజలు అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు కంకర క్వారీ లో శుక్ర వారం సాయంత్రం అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తుండగా గ్రామ ప్రజలు అడ్డుకున్నారు కంకర క్వారీలపై ఢిల్లీలోని హరిత ట్రిబ్యునల్ లో ప్రస్తుతం కేసు నడుస్తోంది కంకర క్వారీలపై ఈనెల 15లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆంధ్ర ప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ అధికారులను ఆదేశించింది ఇదివరకు హరిత ట్రిబ్యునల్ కంకర క్రషర్లు నడపడానికి మాత్రమే అనుమతులు మంజూరు చేసింది కంకర క్వారీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు కానీ స్థానిక ఓ ప్రజాప్రతినిధి చెందిన క్వారీలో కోర్టు ఉత్తర్వులను దిక్కరించి తెల్ల కంకర కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా నేమకల్లు గ్రామ ప్రజలు అడ్డుకొని నలుగురు వ్యక్తులను బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు దీంతో పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున జనం ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఓ ప్రజాప్రతినిధికి చెందిన కంకర క్వారీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దిక్కరిస్తూ భారీ ఎత్తున పేలుళ్లు నిర్వహించడంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బొమ్మనహల్ పోలీసుల కు తాము ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై పోలీసు అధికారులను సంప్రదించగా తమ పరిధిలోకి రాదని మైన్స్ అండ్ జువాలజీ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.