అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కించారు. గత ఏడాది రూ.12,76,955 హుండీ ఆదాయం రాగా ఈ ఏడాది రూ.12,88,465 వచ్చిందని తెలిపారు. కరెన్సీ నోట్లతో పాటు చిట్టెలుక బయటకు రాగా.. ఎలుకలు కొరికిన నోట్ల విలువను లెక్కించారు. దాదాపు 50 వేల రూపాయల విలువైన నోట్లను ఎలుకలు కొరికినట్టు గుర్తించారు. వాటిని దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో కట్టి ట్రెజరీకి జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
అయితే.. హుండీ లెక్కింపు చిన్న పిల్లల చేత చేయించడం పలు విమర్శలకు తావిస్తోంది. కొంతమంది పిల్లలు మాస్కులు కూడా ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా డబ్బులు లెక్కించారు. కరోనా వల్ల ప్రభుత్వం పిల్లలు, 60 సంవత్సరాలు వృద్ధులు ఆలయ ప్రవేశాన్ని నిషేధించింది. అయినా నిబంధనలకు వ్యతిరేకంగా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు చిన్న పిల్లల చేత కరెన్సీ నోట్లను లెక్కించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చూడండి: