అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలో ఛైర్పర్సన్ ఎంపిక అట్టహాసంగా జరిగింది. నంగినేని భవానికి పలువురు సభ్యులు మద్దతు తెలపడంతో.. ప్రిసైడింగ్ అధికారి ఆమెను ఛైర్మన్గా ప్రకటించారు. వైస్ ఛైర్పర్సన్ గా మైమూన్ బీ ని సభ్యులు ఎన్నుకున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ అధికారి గంగాధర్ గౌడ్ ఎదుట.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మొదట ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైకాపా, తెదేపా, సీపీఐకి చెందిన సభ్యులతో ప్రమాణం చేయించారు.
విజయోత్సవం...
పట్టణంలోని ఎస్.ఎల్.వి కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి పురపాలక సంఘం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. స్వతంత్ర అభ్యర్థితో కలిపి వైకాపాకు 29 మంది సభ్యులు ఉన్నారు. తెదేపా సభ్యులకు తగినంత మెజారిటీ లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారం చేసి సభ మధ్యలోనే వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: