అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైకాపాకు చెందిన రెండు వర్గాలు గొడవలకు దిగే పరిస్థితి నెలకొంది. విడపనకల్ మండలం హావళిగిలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరుడు భరత్‌రెడ్డి వైకాపా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారని ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఇక్కడ కేవలం విశ్వేశ్వరరెడ్డి మాత్రమేనని.. ఎవరు పెత్తనం చేలాయించడానికి లేదంటూ అసభ్య పదజాలంతో దూషించారని చెబుతున్నారు.
ఇది జీర్ణించుకోలేని మరో వర్గం కార్యకర్తలు ఈ విషయాన్ని శివరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తన కుమారుడు భీమిరెడ్డి, అనుచరులతో కలిసి గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాల వారు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోగా ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండీ... 40 ఏళ్ల తెలుగుదేశం రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి..!