అనంతపురంజిల్లా ధర్మవరంలో జరిగిన రామకృష్ణ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 24 న ధర్మవరం మార్కెట్ యార్డ్లో రామకృష్ణ హత్యకు గురయ్యాడు. అతన్ని హత్య చేశారనే అనుమానంతో ఆంజనేయులు, భరత్, శ్రీనాథ్, నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పందుల అమ్మకం విషయంలో ఆంజనేయులకు, రామకృష్ణకు విభేదాలు ఉన్నాయి. తన పందులను రామకృష్ణ ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించి పంచాయితీ పెట్టించాడు ఆంజనేయులు. 20 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సొమ్ము సకాలంలో చెల్లించలేదని కోపంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రామకృష్ణను హత్య చేశాడు. నిందితుల నుంచి ఒక కొడవలి, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి