అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కొలిమిపాల్యంలో నిత్యావసరాల కోసం ఓ దుకాణానికి వచ్చిన మహిళపై హత్యాయత్నం జరిగింది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొడ్డలితో దాడి చేసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు.
తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడి ఉన్న మహిళను హుటాహూటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.