అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
కరోనా వారియర్స్ గా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.25 వేలు పారితోషికం అందించి...రక్షణ పరికరాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయుూ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: