ETV Bharat / state

'కేజీ ప్లాస్టిక్​ వ్యర్థాలు తీసుకురండి.. రెండు కేజీల బియ్యం పట్టుకువెళ్లండి' - గుంతకల్లు పురపాలక సంఘ అధికారుల వార్తలు

"లీవ్ ప్లాస్టిక్ సేవ్ గుంతకల్లులో" భాగంగా అనంతపురం జిల్లా పురపాలక సంఘం అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. "ఒక కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకురండి.. 2కేజీల బియ్యాన్ని పట్టుకువెళ్లండి" అనే కార్యక్రమాన్ని ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

"ఒక కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకురండి ..2కేజీల బియ్యాన్ని పట్టుకువెళ్లండి"
author img

By

Published : Oct 26, 2019, 7:45 PM IST

"ఒక కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకురండి ..2కేజీల బియ్యాన్ని పట్టుకువెళ్లండి"

ప్లాస్టిక్​ నిషేధానికి రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా అనంతపురం జిల్లా గుంతకల్లు పురపాలక సంఘం అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 'లీవ్ ప్లాస్టిక్ సేవ్ గుంతకల్లు' పేరిట "ఒక కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకురండి.. 2 కేజీల బియ్యాన్ని పట్టుకువెళ్లండి" అనే కార్యక్రమాన్ని ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంస్థ యాజమాన్యం కూడా ఇందులో భాగస్వామ్యమైంది. పట్టణంలోని వ్యర్థ ప్లాస్టిక్ సేకరించి తెచ్చి ఇచ్చిన వారికి నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి అనంతపురాన్ని ప్లాస్టిక్ రహిత జిల్లాగా నిలపడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. బియ్యం కాకుండా, ఇతర నిత్యావసరాలు కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ తలారి రంగయ్య అధికారులకు సూచించారు.

ఇదీచూడండి.'తెలుగు లోగిళ్లలో దీపావళి ఆనందమయం కావాలి'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.