అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారంపై... ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టి పెట్టారు. మొదటగా.. పట్టణంలోని పలు కాలనీల్లో నీటి సమస్య పరిష్కారానికి నడుం కట్టారు. రెండేళ్లుగా.. తాడిపత్రిలో రోజు విడిచి రోజు కుళాయి నీరు వదులుతుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ కారణంగా... పెన్నా నదిలో పట్టణానికి నీరందించే మోటర్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. మండుటెండలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది.. బోర్లు, మోటర్లు రిపేర్లు చేయిస్తున్నారు.
నాలుగు రోజుల్లో మోటర్లన్నీ బాగు చేయించి రోజూ నీరివ్వాల్సిందేనని పురపాలక సంస్థ సిబ్బందిని హెచ్చరించారు. నీటి సమస్యపై ప్రజల విజ్ఞప్తులను ఎందుకు పట్టించుకోలేదని అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇకపై తాడిపత్రి పట్టణ ప్రజల సమస్యలపై పురపాలక సంస్థ అధికారులు, కౌన్సిలర్లు వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ముందుకు పోతామని తెలిపారు.
ఇదీ చదవండి: