అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘం సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ పోరాళ్లు శిల్ప అధ్యక్షతన జరిగిన సమావేశానికి మున్సిపల్ వైస్ ఛైర్మన్, వార్డు మెంబర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు తదితరులు హాజరయ్యారు. ఒకటో వార్డు మెంబర్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు.15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడతగా 2020- 2021 ఆర్థిక సంవత్సరానికి రూ.1,44,67,003 విడుదల కాగా... ఈ నిధులను రాయదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరా, పైప్లైన్ నిర్మాణం, విద్యుత్తు, సీసీ రోడ్లు, కంపోస్ట్ యార్డులు, పలు అభివృద్ధి పనులకు వినియోగించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అవగాహన ర్యాలీ...
రాయదుర్గం పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పోరాళ్లు శిల్ప, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మస్క్లు, శానిటైజర్, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. వైద్య, పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఇదీ చదవండి