అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉద్యాన రైతుల పరిస్థితిపై ఎంపీ తలారి రంగయ్య ఆరా తీశారు. కళ్యాణదుర్గం వచ్చిన ఆయన పలువురు ఉద్యాన రైతులను కలుసుకొని వారి పండిస్తున్న పంటలు, ప్రస్తుతం మార్కెటింగ్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పండించే రైతులకు నాగపూర్ వంటి ప్రాంతాలకు తమ ఉత్పత్తులను, పళ్ళను తరలించడానికి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక గూడ్స్ రైలు ఏర్పాటు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుపుతూ పలువురు రైతుల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం స్థానిక వైకాపా నాయకుడు తిప్పేస్వామితో కలిసి రైతుల సమస్యల గురించి ఆరాతీశారు.
ఇదీ చూడండి మమ్మల్ని క్షమించండి: ఎల్జీ పాలిమర్స్