ETV Bharat / state

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి - alla party leaders latest news update

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ గోరంట్ల మాధవ్​కు వినతిపత్రాన్ని సమర్పించారు. తనవంతు కృషిగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మాధవ్ హామీ ఇచ్చారు.

all party meeting
అఖిలపక్ష పార్టీ నాయకుల సమావేశం
author img

By

Published : Jul 8, 2020, 8:12 PM IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్​తో అఖిలపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. కళాశాల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం హిందూపురమని వివరించారు. ఇతర ప్రాంతాలకు మెడికల్ కళాశాల తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి హిందూపురం నియోజకవర్గంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మెడికల్ కళాశాల ఏర్పాటుపై ప్రత్యేక కమిటీని నియమించి ఆయా ప్రాంతాల వారి సలహాలు, సూచనలు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.

ఇవీ చూడండి...

'నా పేరు కరోనా.. మాస్కు లేకపోతే మీ కుటుంబాన్ని అవహించేస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.