అనంతపురంలో విశ్వవిద్యాలయ పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సదాశివ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దయానంద్ పర్యటించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, విద్య వంటి సంబంధిత అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. వసతుల కల్పనపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదిచూడండి