అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది పంచాయతీలో రూ.79.40 లక్షల ప్రభుత్వ పనులకు ఎమ్మెల్యే తిప్పేస్వామి భూమి పూజ నిర్వహించారు. నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్ర భవనాలకు శిలాఫలకం ఆవిష్కరించారు.
ఆమిదాలగొంది పంచాయతీ పరిధిలోని టీడీపల్లి, హెచ్.ఆర్.పాలెం, అచ్చంపల్లి గ్రామాల ప్రజలకు సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా అన్ని వసతులు సమకూరనున్నాయి. ఇంటి వద్దకే పరిపాలన వీటితో సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రజలు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు సకాలంలో పొందుతూ, ఆర్.బి.కే.లతో రైతు సమస్యలు, ఆరోగ్య కేంద్రం ద్వారా ఆరోగ్య సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి చాగళ్లు జలాశయం కుడికాలువ నుంచి వృథాగా పోతున్న నీరు