ధర్మవరం పురపాలక ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మవరం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. మున్సిపాలిటికి రావలసిన పన్ను బకాయిలు వెంటనే వసూలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
పట్టణంలో ప్రతి దుకాణదారుడు ట్రేడ్ లైసెన్స్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు . ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో వసూలు చేసి పట్టణాభివృద్ధికి అధికార యంత్రాంగం కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ నుంచి కోటి రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
ఇదీ చదవండీ...ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు...వినియోగదారులకు తప్పని కన్నీళ్లు