వైదారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఎదుట ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పలు సమస్యలపై ఏకరువు పెట్టారు. అనంతపురం జిల్లాలో కరోనా నివారణ చర్యలపై మంత్రి నాని సమీక్ష చేపట్టగా...ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పలు సమస్యలను ప్రస్తావించారు. కరోనా బాధితులు ఉన్న గదుల్లోకి వైద్యులు, నర్సులు వెళ్లట్లేదని చెప్పారు. మానవత్వం మచ్చుకైనా కనపడటం లేదని వ్యాఖ్యానించారు. ఏడు వార్డుల్లో 490 మంది రోగులను కలిసి వివరాలను తెలుసుకున్నానని.... ఆర్డీటీ ఆస్పత్రిలో తప్ప ఎక్కడా భోజనంలో నాణ్యత లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి
కొవిడ్ వార్డుల్లో పెట్టే భోజనంలో నాణ్యత లేదు:ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి