ETV Bharat / state

బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. మధ్యలోనే పాఠశాల పనులు నిలిపేసిన కాంట్రాక్టర్​

School Construction Work Stopped: భూమిపూజ చేసిన పనులకు మరోసారి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ ద్వారా.. భూమిపూజ నిర్వహించారు. కానీ పనులు ప్రారంభించడానికి నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఆ పాఠశాల పూర్తయితే.. ఎంతో మంది పేద పిల్లలకు చదువుకునే అవకాశం వస్తుంది. ఆ కరవు ప్రాంతంలోని ప్రజలు.. ఆ పాఠశాల పూర్తి చేయమని అనేకసార్లు అధికారులకు విన్నవించినా.. ఫలితం మాత్రం శూన్యం.

School Construction Work Stopped
ఆగిన పాఠశాల
author img

By

Published : Mar 2, 2023, 9:50 PM IST

రిమోట్ ద్వారా భూమిపూజ చేసిన సీఎం.. నిలిచిపోయిన పాఠశాల పనులు

School Construction Work Stopped: జరుగుతున్న పనులకు భూమిపూజ నిర్వహించి.. ఒక్క రూపాయి కూడా నిధులివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వ డొల్లతనం.. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల రూపంలో మరోసారి బయటపడింది. గుంతకల్లులో ముస్లిం మైనార్టీ జనాభా అధికంగా ఉండటంతో గత టీడీపీ ప్రభుత్వంలో 18 కోట్ల రూపాయల వ్యయంతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణం ప్రారంభం కాగానే ప్రభుత్వం మారిపోయి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది.

భూమిపూజ చేసిన పనులకు అనంతపురం జిల్లా పర్యటనలో మరోసారి రిమోట్ పద్ధతిలో సీఎం జగన్​ భూమి పూజ నిర్వహించారు. భూమి పూజ అయితే చేశారు కానీ.. నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో అనంతపురం జిల్లా గుంతకల్లులో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం నిలిచిపోయింది.

మైనార్టీల్లో అక్షరాస్యత పెంచటానికి: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం.. విసిరిపడేసినట్లుగా కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో కరవు ప్రాంతంగా గుర్తించిన గుంతకల్లు నియోజకవర్గంలో.. అక్షరాస్యత తక్కువగా ఉండటమే కాకుండా, ఉపాధి కోసం వేలాది మంది బెంగళూరు, ముంబైలకు వెళుతుంటారు. ఇంతటి దుర్భిక్ష ప్రాంతంలో ప్రధాన పట్టణంగా ఉన్న గుంతకల్లులో మైనార్టీల సంఖ్య అధికంగా ఉంటుంది. మైనార్టీల్లో అక్షరాస్యత పెంచటానికి టీడీపీ ప్రభుత్వం ఆ వర్గాల పేద పిల్లలు చదువుకోటానికి అవకాశం కల్పించాలని భావించింది.

మరోసారి రిమోట్​తో: గుంతకల్లులోని కసాపురం రహదారిలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చేసి 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుత్తేదారుకు పనులు అప్పగించింది. ఈలోపే ఎన్నికలు రావటం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువుదీరటంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినపుడు, గతంలో భూమి పూజ చేసిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, జగన్ మరోసారి రిమోట్​తో భూమి పూజ చేశారు.

ఆగిన పనులకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేశారు కాబట్టి, వేగవంతంగా పాఠశాల నిర్మాణం పూర్తై పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు చదువుకునే అవకాశం వస్తుందని అందరూ భావించారు. రిమోట్ భూమి పూజ చేశారు కానీ నిధులు విడుదల చేయకపోవటంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో వస్తాయని వేగంగా పనులు నిర్వహించిన గుత్తేదారుకు విడతలవారీగా రావల్సిన బిల్లలు కూడా మంజూరు కాలేదు. దీంతో ప్రభుత్వంపై అనుమానం వచ్చిన గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోటి 75 లక్షల రూపాయలు బిల్లులు చెల్లించింది. మిగతా బిల్లులు రాకపోవడం వల్ల ఆ గుత్తేదారుడు పనులు నిలిపివేశాడు. ఈ పాఠశాల, వసతి గృహం నిర్మాణం నిలిచిపోవటంతో మైనార్టీ వర్గాల్లోని పేద బాలికలకు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ భవనం నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని గుంతకల్లులోని మైనార్టీ నాయకులు పలుసార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేసినా, అధికారులు, పాలకుల నుంచి స్పందన మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీలకు చాలా చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పూర్తి చేయటానికి నిధులు విడుదల చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ముస్లిం మైనార్టీ నేతలు కోరుతున్నారు.

"బటన్ నొక్కి ప్రారంభించినా.. జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేక.. కాంట్రాక్టర్లు కోర్టుకు కూడా పోయారు. ఈ రోజు అక్కడ చూస్తుంటే.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి". - పవన్ కుమార్ గౌడ్, టీడీపీ బీసీసెల్ రాష్ట్ర నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.