కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ముస్లింలు, క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కామన్నాకట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. కేంద్రం ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఇవీ చూడండి...